
Hyderabad, Sep 14: గుండె సంబంధిత సమస్యలతో (Free Heart Surgeries) బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాద్ లోని నిమ్స్ లో (NIMS) ఉచిత శస్త్ర చికిత్సలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్ లో ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు యూకే వైద్యబృందం దవాఖానకు రానుందని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు. యూకేలో స్థిరపడిన డాక్టర్ రమణ దన్నపనేని ఆధ్వర్యంలో ప్రతి ఏటా వారం రోజుల పాటు నిమ్స్ భాగస్వామ్యంతో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు.
దసరా కూడా రాకుండానే సంక్రాంతి రైళ్లన్నీ ఫుల్.. కేవలం ఐదు నిమిషాల్లోనే బెర్త్ లు ఫుల్
ఆ తేదీల్లో..
ఆర్థిక ఇబ్బందులతో చికిత్స చేయించుకోలేని గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్స అందించనున్నారు. ఈ నెల 22 నుంచి 28 వరకు హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు.