New Delhi December 26: అన్నింటికీ ఆధార్ కార్డు(Aadhar) ఆధారంగా మారుతోంది. కేవలం ఐడెంటిటీ ప్రూఫ్, చిరునామా గుర్తింపు పత్రంగా మాత్రమే కాకుండా అనేక పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేస్తున్నాయి. కొద్దీ రోజుల క్రితం ఎస్‌బీఐ(SBI) ఒక కీలక ప్రకటన కూడా చేసింది. ఖాతాదారులు తప్పనిసరిగా తమ ఖాతాలకు(Link Aadhar with Bank Account) ఆధార్ కార్డు నెంబర్ ను లింక్ చేసుకోవాలని ఎస్‌బీఐ కోరింది. అలాంటి వారు తమ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయిందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది.
దీంతో ఈ కరోనా మహమ్మరి సమయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) అనేక కొత్త సేవలను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా మరో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త సర్విస్ ద్వారా పౌరులు తమ ఆధార్ నెంబర్ ఎన్ని బ్యాంకు ఖాతాలకు లింక్ చేశారో ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎన్ని బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ అయిందో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం యూఐడీఏఐ (https://uidai.gov.in/) వెబ్‌సైట్ లో ప్రత్యేకంగా ఓ లింక్ అందుబాటులో ఉంచింది. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా పౌరులు తమ ఆధార్ నెంబర్ ఎన్ని బ్యాంక్ ఖాతాలకు లింక్ అయిందో క్షణాల్లో తెలుసుకోవచ్చు.
ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ స్టేటస్:
- ముందుగా యూఐడిఏఐ https://uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- తర్వాత హోమ్ పేజీలో 'ఆధార్ సర్వీసెస్' పైన క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీకు కనిపించే "చెక్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్" పైన క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి.
- ఇప్పుడు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి "సెండ్ ఓటీపీ" పైన క్లిక్ చేయాలి.
- ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
- మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి "సబ్మిట్" పైన క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ వివరాలు కనిపిస్తాయి.