Newdelhi, May 27: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని (Postal Circles) బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్-GDS) ఖాళీల భర్తీకి సంబంధించి స్పెషల్ సైకిల్ మే-2023 ప్రకటన వెలువడింది. పదో తరగతిలో (SSC) సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం-BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా మొత్తం 12,828 ఖాళీలు ఉండగా, తెలంగాణలో 96 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు.
India Post GDS Recruitment 2023 Apply Online for 12828 Post#Jobs #GovtJob #Shorts #SarkariJob #JobsShorts #Recruitment #Notification #News #Vacancy #Study #Education #Exam #Naukri #Govt #GovernmentJob #IndiaPost #PostMan #GDS #PostOffice pic.twitter.com/eft4TeAlRc
— Govt Jobs Shorts (@JobsShorts) May 23, 2023
అర్హతలు
- పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి.
- ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి.
- వయసు 18 నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండాలి.
వేతనాలు ఇలా..
- జీతం నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380
- ఏబీపీఎం పోస్టులకు రూ.10,000 - రూ.24,470
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి సమాచారం కోసం www.indiapostgdsonline.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.