Budget 2019 Announcements: వేటి ధరలు తగ్గనున్నాయి? వేటి ధరలు పెరగనున్నాయి. సామాన్యునిపై బడ్జెట్ ఎలాంటి ప్రభావం చూపించబోతుంది తెలుసుకోండి

2019- 20 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5, 2019న లోకసభలో యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశ భవిష్యత్తు, జాతీయ భద్రత మరియు భారత్ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే లక్ష్యంగా తమ బడ్జెట్ ప్రవేశపెట్టామని ఆమె తెలిపారు.

భారత్ ను అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యంగా చెప్పారు. గతంలో 2014 వరకు భారతదేశ సంపద 1.85 ట్రిలియన్ డాలర్లు ఉండగా 2019 నాటికి 3 ట్రిలియన్ డాలర్లు ఉంది, గడిచిన 5 ఏళ్ల కాలంలోనే దేశ సంపదను 2.7 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు తమ ప్రభుత్వం పెంచిందన్నారు. రాబోవు సంవత్సరాలలో దేశ సంపదను 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు పెంచి ప్రపంచంలో భారత్ ను మరింత బలమైన ఆర్థిక వ్యవస్థ గల దేశంగా మారుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

దేశపురోభివృద్ధికి ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టామని, ఇక ముందు కూడా క్రమశిక్షణతో పనిచేసి అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని, పేద, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతి కోసం తమ బడ్జెట్ ఉంటుందని ఆర్థిక మంత్రి తెలిపారు.  ( బడ్జెట్ పూర్తి వివరాలు  - https://www.indiabudget.gov.in/budgetspeech.php )

కాగా, ఫైనాన్స్ మినిస్టర్ 2019 - 20 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం దేశ పౌరులపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? వేటి ధరలు పెరగనున్నాయి, వేటి ధరలు తగ్గనున్నాయి చూడండి.

ధరలు పెరిగేవి

పెట్రోల్- డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం విధించడంతో వీటి ధరలు పెరగనున్నాయి, సామాన్యుడిపై ఇది భారమే అని చెప్పాలి.

బంగారం, వెండి ధరలు మరింత పెరగనున్నాయి.

పొగాకు ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్.

వస్తువులు ఎగుమతులపై టాక్స్ లు ఎక్కువ కానున్నాయి.

ఆటోమొబైల్స్ కి సంబంధించిన స్పేర్ పార్ట్స్, పీవీసీ పైపులు, సింథటిక్ రబ్బర్, ఇళ్ల నిర్మాణంలో వాడే టైల్స్ ధరలు ప్రియం కానున్నాయి.

ఆప్టికల్ ఫైబర్, స్టెయిన్ లెస్ స్టీల్, మెటల్ ఫిట్టింగ్స్, అలంకరణ వస్తువులు

ఏసీలు, లౌడ్ స్పీకర్లు, కెమెరాలు, సీసీటీవీలు, వాహనాల హర్న్ ధరలు పెరగనున్నాయి.

ధరలు తగ్గేవి

హోంలోన్స్ పై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి

ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గనున్నాయి

ఇంట్లో ఉపయోగించే పాత్రలు, బల్బులు, బ్రీఫ్ కేసులు, బ్యాగులు, కిచెన్ సంబంధమైన వస్తువులు

రోజూ వాడేవి - సబ్బులు, షాంపూలు, హెయిర్ ఆయిల్స్, టూత్ పేస్ట్, బెడ్స్, పరుపులు