Jobs. (Representational Image | File)

New Delhi, June 10: భారత పభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ (NHLML)లో పలు పోస్టుల భర్తీ (Jobs) చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ (Notification)ద్వారా 9 ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్ రోప్ వేస్, మేనేజర్ లాజిస్టిక్స్, సీనియర్ మేనేజర్ ప్యాసింజర్ కన్వీనియన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, కంపెనీ సెక్రెటరీ, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ప్రైవేట్ సెక్రటరీ, మేనేజర్ ఓఎఫ్సీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తదితర ఖాళీలు ఉన్నాయి.

Telangana Govt Jobs 2022: నిరుద్యోగులకు మరో శుభవార్త, 1,433 పోస్టులకు తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌, త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల  

ఆసక్తిగల, అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు (Applications) కోరుతున్నారు. అభ్యర్దుల వయస్సు 56 ఏళ్ల లోపు ఉండాలి. విద్యార్హతల విషయానికి వస్తే పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్ లో డిగ్రీ, లా డిగ్రీ, పీజీ, డిప్లొమా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి. ఎంపికకు సంబంధించి సెలక్షన్ కమిటీ అధారంగా ఎంపిక ఉంటుంది.

AP Govt Jobs: ఏపీ నిరుద్యోగులకు CM Jagan గుడ్‌న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జగన్ గ్రీన్ సిగ్నల్, పండగ చేసుకుంటున్న నిరుద్యోగులు, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మార్గం సుగమం..  

దరఖాస్తులను ఈ మెయిల్, ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; ఎస్.హెచ్. రవీంద్ర , డైరెక్టర్, నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్ మెంట్ లిమిటెడ్, జి5&6 సెక్టార్ 10, ద్వారక , న్యూదిల్లీ, ఈ మెయిల్ ; ravinder.nhlml@nhai.org,దరఖాస్తులు పంపేందుకు చివరి తేదిగా జులై 4, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://nhai.gov.in/#/పరిశీలించగలరు.