Newdelhi, July 14: ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) ఇప్పటివరకు 145 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే (Himachal Pradesh) 91 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో (Uttarpradesh) 14 మంది, హర్యానాలో (Haryana) 16, పంజాబ్‌లో 11, ఉత్తరాఖండ్‌లో 16 మంది మృతి చెందారు. ఢిల్లీలో మరింత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరదల నేపథ్యంలో ఢిల్లీలో ఎల్లుండి (16వ తేదీ) వరకు స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అలాగే, ఎర్రకోట సందర్శనను నేడు నిలిపివేస్తున్నట్టు తెలిపారు.
ఈ రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు
హిమాచల్‌ప్రదేశ్, హర్యానాలో, ఉత్తరాఖండ్‌లో నేడు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.