New Delhi, March 12: ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది కేంద్ర ప్రభుత్వం. ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund ) పై వడ్డీరేటును భారీగా తగ్గించే దిశగా కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎఫ్‌పై వడ్డీరేటును (Interest rate) 40 ఏళ్ల కనిష్ఠానికి తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌(EPFO) జమలపై 8.1శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈపీఎఫ్‌వో నిర్ణయ మండలి కేంద్ర ధర్మకర్తల బోర్డు (CBT) శనివారం సమావేశమైంది. ఈ భేటీలోనే పీఎఫ్‌ వడ్డీరేటుపై నిర్ణయం తీసుకున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. 8.1 శాతం వడ్డీరేటు నిర్ణయాన్ని సీబీటీ కేంద్ర ఆర్థికశాఖకు పంపనుంది. ఆర్థికశాఖ నుంచి ఆమోదం పొందిన తర్వాత చందాదారులకు వడ్డీ జమ చేస్తారు. కాగా.. ఈపీఎఫ్‌పై ఇంత తక్కువగా వడ్డీ రేటు (interest rate) ఇవ్వడం 1977-78 తర్వాత ఇదే తొలిసారి.

PF Withdrawal: మీ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బు విత్ డ్రా చేయాలనుకుంటున్నారా? ఏయే సందర్భాల్లో, ఎంత డబ్బు విత్ డ్రా చేయవచ్చో తెలుసుకోండి.

ఆ ఏడాది పీఎఫ్‌పై 8శాతం వడ్డీ ఇచ్చారు. 2018-19, 2016-17లో 8.65శాతం చొప్పున వడ్డీ జమ చేయగా.. 2013-14, 2014-15లో 8.75శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8శాతం చొప్పున జమచేశారు. అయితే కొవిడ్‌ సమయంలో విత్‌డ్రాలు పెరగడం, చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గిపోవడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని ఏడేళ్ల కనిష్ఠానికి తగ్గించి 8.5శాతంగా ఇచ్చారు. గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)కూడా ఇదే 8.5శాతం వడ్డీని కొనసాగించారు.