Hyderabad, July 28: హైదరాబాద్‌లో (Hyderabad) వాన (Rain) మళ్లీ మొదలైంది. రెండు రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం గురువారం సాయంత్రం నిలిచిపోయింది. అయితే నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున వాన మళ్లీ షురూ అయింది. కోఠి, నాంపల్లి, లక్డీకపూల్, మాసబ్‌ట్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్టా, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్, కొండాపూర్, ఏఎస్ రావు నగర్, కూకట్‌పల్లి, నీజాంపేట్, మూసాపేట్, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, ప్రగతి నగర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. నగర వ్యాప్తంగా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నది. నేడు హైదరాబాద్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
తెలంగాణ జిల్లాల్లో కూడా
నేడు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు.