Mumbai, March 11: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకు (Paytm Payments Bank)పై భారత రిజర్వ్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో కొన్ని మెటీరియల్ సూపర్ వైజరీ సమస్యల కారణంగా ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో విజయ్ శేఖర్ శర్మ (Vijay Shekar Sharma) నేతృత్వంలోని పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ సంస్థకు కొత్త కస్టమర్లను తీసుకోవద్దంటూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.పేటీఎం ఐటీ సిస్టమ్స్ పై సమగ్ర సిస్టమ్ ఆడిట్ పూర్తి చేసేంతవరకు ఐటీ అడిట్ సంస్థను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. పేటీఎం బ్యాంకులో సూపర్ వైజరీ సమస్యలు ఉన్నాయని ఆర్బీఐ (RBI)దృష్టికి వచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో శర్మ సొంతంగా 51శాతం వాటాను కలిగి ఉన్నారు. అందుకే దీనిపై పూర్తి స్థాయిలో ఆడిట్ నిర్వహించేందుకు తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్టు ఆర్బీఐ ఒక ప్రకటలో వెల్లడించింది. ఈ క్రమంలోనే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన ఐటీ సిస్టమ్‌పై సమగ్ర సిస్టమ్ ఆడిట్ నిర్వహించేందుకు ఐటీ ఆడిట్ సంస్థను నియమించాల్సిందిగా ఆదేశించినట్లు ఆర్బీఐ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయంతో పేటీఎం వినియోగదారులు షాక్ కు గురయ్యారు.
Action against Paytm Payments Bank Ltd under section 35 A of the Banking Regulation Act, 1949https://t.co/tqWfwt7mT3
— ReserveBankOfIndia (@RBI) March 11, 2022
Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడం అనేది IT ఆడిటర్ల నివేదికను సమీక్షించిన తర్వాతే జరగాల్సి ఉంది. అది కూడా RBI మంజూరు చేసే నిర్దిష్ట అనుమతికి లోబడి ఉండాలని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఆగస్ట్ 2016లో Paytm పేమెంట్స్ బ్యాంక్ స్థాపించారు. మే 2017లో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలను ప్రారంభించింది.
నోయిడాలో మొదటి బ్రాంచ్ ప్రారంభించింది. Paytm పేమెంట్స్ బ్యాంక్ డిసెంబర్ 2021లో ‘షెడ్యూల్డ్ పేమెంట్స్ బ్యాంక్’గా పనిచేసేందకు RBI అనుమతిని పొందింది. తద్వారా ఆర్థిక సేవల కార్యకలాపాలను విస్తరించింది. Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ వాల్యుయేషన్ గురించి ఆందోళనలు తలెత్తిన నేపథ్యంలోనే RBI ఈ దిశగా చర్యలు చేపట్టింది.
Paytm పేమెంట్స్ బ్యాంక్ గత డిసెంబర్‌లో 926 మిలియన్ల UPI లావాదేవీలను నిర్వహించింది. ఈ మైలురాయిని సాధించిన దేశంలోనే మొదటి లబ్ధిదారు బ్యాంకుగా Paytm Payments Bank అవతరించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ 2021 త్రైమాసికంలో, Paytm పేమెంట్స్ బ్యాంక్ మొత్తం 2,507.47 మిలియన్ లబ్దిదారుల లావాదేవీలను నమోదు చేసింది. 2020 అదే త్రైమాసికంలో 964.95 మిలియన్లతో పోలిస్తే… ఏడాదికి 159.85 శాతం పెరిగింది. డిసెంబరు 2020లోనూ HDFC బ్యాంక్ కొత్త డిజిటల్ ప్రొడక్టులు లేదా సర్వీసులను ప్రారంభించకుండా కొత్త క్రెడిట్ కార్డుల జారీపై ఆర్బీఐ నిషేధం విధించింది. డిజిటల్ ప్రొడక్టుల్లోని సాంకేతిక సమస్యల కారణంగానే ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.