Tirumala, May 19: తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. కొండపై భక్తుల రద్దీ విపరీతంగా (Devotees Rush) పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తో పాటు నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. ఆక్టోపస్ బిల్డింగ్ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
తిరుమల వెళ్లేవారికి షాకింగ్ న్యూస్.. 3 కిలోమీటర్లు బారులు తీరిన భక్తులు#Tirumala #TirumalaRush #TirumalaDarshan #TirumalaTickets #TirumalaTirupatiDevasthanamhttps://t.co/RknqcYHhdi
— Samayam Telugu (@SamayamTelugu) May 19, 2024
భారీగా ఆదాయం
భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. శనివారం నాడు శ్రీవారిని 90,721 మంది భక్తులు దర్శించుకోగా ఒక్కరోజే రూ.3.28 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.