Prime Minister Narendra Modi | File Image | (Photo Credits: ANI)

వారణాసి, డిసెంబర్ 12: ప్రధాని మోడీ కలల ప్రాజెక్ట్ కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను రేపు (డిసెంబర్ 13) జాతికి అంకితం చేయనున్నారు. సుమారు రూ. 600 కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. దీంతో రేపు చేపట్టనున్న వారణాసి పర్యటన ప్రధాని నరేంద్ర మోడీకి చాలా ప్రత్యేకత సంతరించుకుంది. ఇదిలా ఉంటే, కాశీ-విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవానికి వందలాది మంది సాధువులు, మహంతులు హాజరుకానున్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే విశ్వనాథుడి ఆలయాన్ని గంగా నదికి అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఇంతకు ముందు ఆలయానికి, నదికి ప్రత్యక్ష సంబంధం లేదు. ఇకపై భక్తులు ఎలాంటి అడ్డంకులు లేకుండా గంగానది లలితా ఘాట్‌ను సందర్శించవచ్చు.

ఈ సందర్భంగా కాశీ నగరం, చుట్టుపక్కల ప్రజలకు లడ్డు ప్రసాదం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. , కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం తర్వాత దాదాపు 16 లక్షల లడ్డూలపంపిణీ చేయనున్నామని అధికారులు తెలిపారు. సుమారు 7 లక్షల ఇళ్లకు వందల గ్రూపులు ఈ స్వీట్స్ ను పంచనున్నారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా రేపు నగరమంతటా స్వీట్లు పంచనున్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం తర్వాత 7 లక్షల ఇళ్లలో వందల గ్రూపుల ద్వారా పంపిణీ చేయనున్నారు. స్వీట్స్ పంపిణి కోసం దాదాపు 16 లక్షల లడ్డూలను రెడీ చేస్తున్నారు. .

కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ వందలాది మంది లడ్డూల తయారీ, ప్యాకింగ్ తదితర పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే దేశీ నెయ్యితో లడ్డులను తయారు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వారణాసిలో తొలిసారిగా నగరం అంతటా ఇంత పెద్ద ఎత్తున ప్రసాదాన్ని ఇంటింటికీ పంపనున్నట్లు చెప్పారు. ఈ 16 లక్షల లడ్డూలను దాదాపు 15 వేల గ్రూపుల ద్వారా పంపిణీ చేయనున్నారు. వారణాసిలో సుమారు 8 లక్షల వరకూ ఇళ్ళు ఉన్నాయని.. ఇంటింటికి లడ్డులు ప్రసాదం పంపిణీకి వాలంటీర్ల సహకారం కూడా తీసుకుంటామని కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ తెలిపింది.