Medaram Sammakka Saralamma Jatara (Photo-Twitter)

Medaram, FEB 22: ములుగు జిల్లా మేడారం మహాజాతరలో (Medaram Mahajatara) నేడు కీలకఘట్టం జరగనుంది. చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క (Sammakka) అమ్మవారిని తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠంచనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అధికారికంగా మంత్రి సీతక్క (Seethakka) స్వాగతం పలుకుతారు. ఇప్పటికే గద్దెలపైకి సారలమ్మ (Saralamma), పగిడిద్దరాజు, గోవిందరాజులు చేరుకున్నారు. మేడారం జాతర సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 23వ తేదీన సెలవు దినంగా (Holiday) ప్రకటించారు. జాతర వేళ ములుగు జిల్లాలోని మేడారం అభయరణ్యం జనారణ్యంగా మారింది.

 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ మహా జాతరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. జాతరకు ఐదు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు, వీఐపీలు, వీవీఐపీలు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. మావోయిస్టు యాక్షన్ టీమ్‌తో ముప్పు ఉన్న నేపథ్యంలో పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు.