New RTI Act, Road Safety- representational image.

తెలుగులో మహేశ్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమా చూసే ఉంటారు కదా? ఆ సినిమాలో సీఎంగా మహేశ్ బాబు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించేవారికి రూ. 10వేలు, 20 వేలు అంటూ జరిమానాలు విధిస్తాడు. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఇలా విధించడం ఇండియాలో సాధ్యపడకపోవచ్చు అని అప్పుడు రాష్ట్ర మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కానీ, ఇప్పుడు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం దానిని నిజం చేశారు. భారీ జరిమానాలతో నూతన రవాణా బిల్లుకు రూపకల్పన చేశారు.

వివరాల్లోకి వెళ్తే...

మోటార్ వెహికిల్ అమెండ్‌మెంట్ 2019 (Motor Vehicle Amendments Bill 2019) బిల్లుకి పార్లమెంట్ ఆమోదం లభించింది. 30 ఏళ్లనాటి పాత మోటార్ వాహన చట్టంలో సవరణలు చేస్తూ, రోడ్డు భద్రతను మెరుగుపరుచుట, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి విధించే జరిమానాల పెంపు మరియు RTO (Regional Transport Office) లలో అవినీతి నిర్మూలన వంటి అంశాలతో కేంద్ర ప్రభుత్వం నూతన మోటార్ వాహన బిల్లుకు రూపకల్పన చేసింది. మొదట లోకసభలో సభ్యుల ఆమోదం పొందిన ఈ బిల్లు, అనేక వాదోపవాదాల తర్వాత జూలై 31, 2019న రాజ్యసభలోనూ ఆమోదం పొందటంతో చట్టరూపం దాల్చింది.

ఇక ఈ నూతన మోటార్ వాహన చట్టం 2019 ప్రకారం ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ నుంచి అతిభారీగా జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. నిర్లక్ష్య డ్రైవింగ్ తో యాక్సిడెంట్ చేసి వ్యక్తి మృతికి కారణమైతే రూ. 5 లక్షలు లేదా తీవ్ర గాయాలైతే రూ.2.5 లక్షలు వారి కుటుంబానికి పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది.

అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ లేక మరేదైనా ఎమర్జెన్సీ వెహికిల్ కి దారి ఇవ్వకపోతే రూ. 10,000 జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ తొలగింపు. ఆపై డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే గరిష్టంగా రూ. 1 లక్ష వరకు జరిమానా విధింపు.

నిర్ధిష్ట పరిమితికి మించి వేగంగా వెళ్తే రూ. 1000 నుంచి రూ.2000 వరకు జరిమానా. ఇన్సూరెన్స్ లేకపోతే రూ. 2000, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే రూ.1000 మరియు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.

మైనర్లు వాహానాలు నడిపి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి తల్లిదండ్రులు లేదా సంరక్షులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగా రూ. 25,000 జరిమానా, 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఏకంగా వారి వాహన రిజిస్ట్రేషన్ ను రద్దు చేయబడుతుంది.

 

Proposed Amendments in Various Penalties under Motor Vehicles (Amendment) Bill – 2019

Section Old Provision / Penalty New Proposed Provision / Minimum Penalties
177 General Rs 100 Rs 500
New 177A Rules of road regulation violation Rs 100 Rs 500
178 Travel without ticket RS 200 Rs 500
179 Disobedience of orders of authorities Rs 500 Rs 2000
180 Unautorized use of vehicles without licence Rs 1000 Rs 5000
181 Driving without licence Rs 500 Rs 5000
182 Driving despite disqualification Rs 500 Rs 10,000
182 B Oversize vehicles New Rs 5000
183 Over speeding Rs 400 Rs 1000 for LMV

Rs 2000 for Medium passenger vehicle

184 Dangerous driving penalty Rs 1000 Upto Rs 5000
185 Drunken driving Rs 2000 Rs 10,000
189 Speeding / Racing Rs 500 Rs 5,000
192 A Vehicle without permit upto Rs 5000 Upto Rs 10,000
193 Aggregators (violations of licencing conditions) New Rs 25,000 to

Rs 1,00,000

194 Overloading Rs 2000 and

Rs 1000 per extra tonne

Rs 20,000 and

Rs 2000 per extra tonne

194 A Overloading of passengers Rs 1000 per extra passenger
194 B Seat belt Rs 100 Rs 1000
194 C Overloading of two wheelers Rs 100 Rs 2000, Disqualification for 3 months for licence
194 D Helmets Rs 100 Rs 1000 Disqualification for 3 months for licence
194 E Not providing way for emergency vehicles New Rs 10,000
196 Driving Without Insurance RS 1000 Rs 2000
199 Offences by Juveniles New Guardian / owner shall be deemed to be guilty. Rs 25,000 with 3 yrs imprisonment. For Juvenile to be tried under JJ Act. Registration of Motor Vehicle to be cancelled
206 Power of Officers to impound documents Suspension of driving licenses u/s 183, 184, 185, 189, 190, 194C, 194D, 194E
210 B Offences committed by enforcing authorities Twice the penalty under the relevant section

అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేస్తే రూ. 5000, మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే రూ. 10, 000, పరిమితికి మించి వాహనంలో ఓవర్ లోడ్ చేస్తే రూ. 20,000 జరిమానాలుగా విధించనున్నారు. మొత్తంగా చూస్తే గతంలో విధించే జరిమానాలకు ఇకపై ఏకంగా 5- 20 రేట్లు పెంచేసి కొత్తగా జరిమానాలు, కొత్త శిక్షలు అమలు చేయబోతున్నారు.