Newdelhi, Sep 7: మానవ రక్తం (Human Blood) రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన తోడేళ్ల (Wolves) బెడదతో యూపీలోని బహరాయిచ్ జిల్లా గడగడలాడుతున్నది. ఈ మృగాలను పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి చిక్కడం లేదు. ఈ క్రమంలో యూపీ మంత్రి బేబీ రాణి మౌర్యా వింత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కంటే తోడేళ్లు తెలివైనవని.. అందుకే వాటిని సులువుగా పట్టుకోలేకపోతున్నామన్నారు. మిగతా జంతువుల్లా బంధించడం అంత సులువు కాదని చెప్పారు.
50 రోజులుగా భయం భయం
తోడేళ్ల భయంతో యూపీలోని పలు గ్రామాల పిల్లలు స్కూల్స్, కాలేజీలకు వెళ్లడం మానేశారు. మార్కెట్లు, దుకాణాలు బంద్ అయ్యాయి. రైతులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లడానికే భయపడే దుస్థితి దాపురించింది. మాహ్సీ సబ్ డివిజన్‌లోని పలు గ్రామాలు భయంతో నిర్మానుష్యంగా మారిపోయాయి. గడిచిన 50 రోజులుగా జిల్లా వాసులు కంటిమీద కునుకులేకుండా బతుకుతున్నారు. నరమాంస భక్షక తోడేళ్ల దాడిలో 35 మంది ప్రజలు గాయపడ్డారు. 10 మంది ప్రాణాలు కోల్పోయారు.