Crackers explode during Lord Jagannath's Chandan Yatra (Photo Credits: ANI)

Puri, May 30: ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో అపశ్రుతి చోటుచేసుకుంది. పటాకులు (Firecrackers) పేలడంతో 15 మంది భక్తులు గాయపడ్డారు. బుధవారం రాత్రి పూరీలోని నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథుడి చందన ఉత్సవం (Festivities in Puri) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వందలాది మంది తరలివచ్చారు. ఈ క్రమంలో కొంతమంది భక్తులు పటాకులు (Firecracker) పేల్చడంతో ఆ నిప్పురవ్వలు సమీపంలో బాణసంచా నిల్వ ఉంచిన చోట పడ్డాయి.

 

దీంతో పెద్దఎత్తున పేలుడు సంభవించడంతో అక్కడున్న భక్తులు గాయపడ్డారు. కొంతమంది తమనుతాము రక్షించుకునేందుకు పుష్కరిణిలోకి దూకారు. క్షతగాత్రులను పోలీసులు జిల్లా దవాఖానకు తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.

 

ఈ ఘటనపై సీఎం నవీన్‌ పట్నాయక్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. చికిత్సకు అవసరమైన మొత్తాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి చెల్లిస్తామని తెలిపారు.