Cloud Burst in Sikkim (PIC@ ANI X)

Gangtok, OCT 04: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఆకస్మిక వరదలు (Cloudburst) ముంచెత్తాయి. ఉత్తర సిక్కింలో () కురిసిన కుండపోత వర్షానికి లాచెన్‌ లోయలో గల తీస్తా నది (Teesta River) ఉప్పొంగింది. దీంతో ఆకస్మిక వరదలతో ఆ ప్రాంతమంతా అతలాకుతం అయింది. తీస్తా నది పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాలు నీట (Cloud Burst in Sikkim) మునిగాయి. నది తీర ప్రాంతంలో విధుల్లో ఉన్న 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయినట్లు (23 Army Personnel Missing) రక్షణశాఖ ప్రకటించింది.

 

వరదల కారణంగా కొన్ని వాహనాలు కూడా నీటమునిగాయి. ఆర్మీ సిబ్బంది కోసం భారీఎత్తున గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతయిన వారి వివరాలను రక్షణశాఖ సేకరిస్తోంది. వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.