Manipur: మణిపూర్‌లో విరిగిపడిన కొండచరియలు, ఏడుగురు జవాన్లు మృతి, 45 మంది గల్లంతు, ఘటనపై మణిపూర్‌ సీఎం బిరేన్‌ సింగ్‌ దిగ్భ్రాంతి
7 Dead, 45 Missing After Massive Landslide At Manipur Mega Train Project Site (Photo-ANI)

Impal, June 30: మ‌ణిపూర్‌లోని నోని జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. తుపుల్ యార్డ్ రైల్వే క‌న్‌స్ట్ర‌క్ష‌న్ క్యాంపుపై బుధ‌వారం రాత్రి కొండ‌చ‌రియ‌లు (Massive Landslide At Manipur) విరిగిప‌డ్డాయి. నోనీ జిల్లాలో భారీ కొండచరియలు ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, 45 మంది (7 Dead, 45 Missing) గల్లంతయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిరిబామ్ నుంచి ఇంఫాల్ వరకు రైల్వే లైన్ నిర్మాణంలో ( Mega Train Project Site) ఉంది. దీని రక్షణ కోసం టుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో 107 టెరిటోరియల్ ఆర్మీ బేస్‌ క్యాంప్‌ని ఏర్పాటు చేశారు. కాగా బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆ బేస్‌ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి.

ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, 45 మంది ఆచూకీ గల్లంతైంది. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. ఇప్పటివరకు 19 మందిని రక్షించారు. ఆ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మణిపూర్‌ సీఎం బిరేన్‌ సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అయితే కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో.. అక్క‌డున్న న‌ది ప్ర‌వాహం ఆగిపోయింది. దీంతో నోని జిల్లా ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు. న‌ది వ‌ద్ద‌కు పిల్ల‌ల‌ను వెళ్ల‌నివ్వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

Here's ANI Tweets

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై మ‌ణిపూర్ ముఖ్య‌మంత్రి ఎన్ బీరెన్ సింగ్ అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు. తుపుల్‌లో ఇవాళ జ‌రిగిన ప్ర‌మాద ఘ‌ట‌న‌పై అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు బీరెన్ సింగ్ ప్ర‌క‌టించారు. స‌హాయ‌క చ‌ర్య‌లు అక్క‌డ కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. ఘ‌ట‌నాస్థ‌లికి అంబులెన్స్‌ల‌తో పాటు వైద్యుల‌ను పంపాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.