Mumbai, November 30: మహారాష్ట్రలోని ధూలే తహసిల్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి నదిలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది (Seven people were killed and 15 injured )తీవ్రంగా గాయపడ్డారు. వించూరు గ్రామానికి సమీపంలోని ధూలే - సోలాపూర్ హైవే(Vinchur village on the Dhule-Solapur Road)పై ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. విషాద ఘటనపై దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.