Lucknow, July 07: ప్రముఖ కాంగ్రెస్ నేత, నటుడు రాజ్‌ బబ్బర్ కు రెండేళ్ల జైలుశిక్ష విధించింది ఉత్తరప్రదేశ్ కోర్టు. 1996 కు సంబంధిన ఓ కేసుకు సంబంధించి రాజ్ బబ్బర్ ను దోషిగా తేల్చింది. ఎన్నికల అధికారిపై దాడికి పాల్పడ్డ కేసులో రాజ్ బబ్బర్‌కు(Raj Babbar) రెండేళ్ల జైలు శిక్ష విధించింది ఉత్తర ప్రదేశ్ కోర్టు(UP Court). కేసు వివరాల ప్రకారం.. 1996లో రాజ్ బబ్బర్ (Raj Babbar) ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ(Samajwadi party) తరఫున లోక్‌సభకు పోటీ చేశారు. అయితే, ఎన్నికల సందర్భంగా ఒక పోలింగ్ బూత్‌లో అక్కడ విధుల్లో ఉన్న అధికారికి, రాజ్ బబ్బర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం క్రమంగా పెరగడంతో ఎన్నికల అధికారిపై రాజ్ బబ్బర్‌ దాడికి పాల్పడ్డాడు. దీంతో 1996 మే 2న రాజ్ బబ్బర్‌పై వాజిర్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సెక్షన్ 143, 332, 353, 323, 504, 188 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

అయితే అప్పట్లో ఆయనకు ఈ కేసులో బెయిల్ లభించింది. కాగా, ఈ కేసుపై ఇంతకాలంగా విచారణ సాగింది. ఈ కేసులో రాజ్ బబ్బర్‌(Raj Babbar) తప్పు చేశాడని కోర్టు గుర్తించింది. అతడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. అలాగే రూ.8,500 జరిమానా కూడా విధించింది.

UK PM Boris Johnson Resigns: ప్రధాన మంత్రి పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా, బ్రిటన్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం, ప్రధానిపై నమ్మకం కోల్పోయామంటున్న నేతలు 

కాగా, తీర్పు సమయంలో రాజ్ బబ్బర్‌ కోర్టులోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఈ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీనిపై లాయర్లు సంప్రదింపులు జరుపుతున్నారు.