Vande bharat (Photo Credits: Twitter)

Bulanshahar, OCT 08: రైల్వేశాఖ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express) రైళ్లు వరుస ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. గత రెండు రోజుల్లో ముంబయి-గాంధీనగర్‌ (Mumbai- Gandhi Nager) వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండుసార్లు పశువులను ఢీకొని ఆగిపోగా.. తాజాగా మరో వందే భారత్‌ రైలులో సాంకేతిక సమస్య ఏర్పడింది. శనివారం వారణాసి బయల్దేరిన ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ట్రాక్షన్‌ మోటార్‌ జామ్‌ అవడంతో మధ్యలోనే ఆగిపోయింది. ఢిల్లీ నుంచి వారణాసి బయల్దేరిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ లో‌.. మార్గమధ్యంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహార్‌ సమీపంలో దన్‌కౌర్‌, వేర్‌ స్టేషన్ల మధ్య రైలు సీ8 కోచ్‌కు సంబంధించిన ట్రాక్షన్‌ మోటార్‌లో బేరింగ్‌ (jammed wheel) పనిచేయలేదు. గ్రౌండ్‌ స్టాఫ్‌ ఈ లోపాన్ని గుర్తించి వెంటనే రైల్వే ఆపరేషన్స్‌ కంట్రోల్‌ వ్యవస్థను అప్రమత్తం చేశారు.

Vande Bharat Express Hits Cow: నిన్న బర్రెలు, ఇవాళ ఆవులు, వందేభారత్ ట్రైన్‌కు మరో ప్రమాదం, ఆవు ఢీకొట్టడంతో ముందుభాగం డ్యామేజ్, వందే భారత్ ట్రైన్ క్వాలిటీపై విమర్శలు 

దీంతో రైల్లోనే ఉన్న సాంకేతిక సిబ్బంది తనిఖీ చేసి.. ఎక్స్‌ప్రెస్‌ రైలును నియంత్రిత వేగంతో 20కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుర్జా రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి ఆపారు. అక్కడ 5 గంటల పాటు మరమ్మతులు చేసినా ఫలితం లభించలేదు. దీంతో అందులోని ప్రయాణికులను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో గమ్యస్థానానికి చేర్చినట్లు రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు.

Vande Bharat Train Hits RECORD: మెరుపువేగంతో దూసుకెళ్లిన వందేభారత్ ట్రైన్, స్పీడ్ టెస్ట్‌లో గంటకు 180 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లింది, వీడియో ఇదుగోండి! 

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదాలను ఎదుర్కోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. గురువారం ముంబయి - గాంధీనగర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు.. అహ్మదాబాద్‌ సమీపంలోని వట్వా రైల్వేస్టేషను వద్ద గేదెలను ఢీకొనడంతో ముందు భాగం దెబ్బతింది. ఆ తర్వాత శుక్రవారం మధ్యాహ్నం గాంధీనగర్‌ నుంచి ముంబయికి బయలుదేరిన రైలు వంద కి.మీ.ల దూరంలోని ఆనంద్‌ స్టేషను సమీపంలో ఆవును ఢీకొంది. మళ్లీ ముందుభాగం నొక్కుకుపోయి రైలు పది నిమిషాలు ఆగింది.