![](https://test1.latestly.com/wp-content/uploads/2022/04/EV-380x214.jpg)
New Delhi, April 21: దేశంలో ఇటీవల వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles) పేలుళ్లతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. క్వాలిటీ విషయంలో రాజీ పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ సంస్థలకు (EV Manufactures) హెచ్చరికలు జారీ చేసింది. వరుస ప్రమాదాలపై విచారణకు ఆదేశించినట్లు కేంద్రమంత్రి గడ్కరీ (Nitin Gadkari) తెలిపారు. క్వాలిటీ విషయంలో రాజీ పడిన కంపెనీలకు భారీగా ఫైన్లు వేస్తామని సంకేతాలు పంపారు. లోపాలున్నాయని తేలితే వెంటనే కంపెనీలు వాహనాలు వెనక్కు తీసుకునేలా నిబంధనలు సవరిస్తామన్నారు గడ్కరీ.
కేంద్రం నియమించిన కమిటీ నివేదిక రాగానే ఎలక్ట్రిక్ వాహనాల క్వాలిటీకి (Quality) సంబంధించిన కఠిన నిబంధనలు తీసుకొస్తామని చెప్పారు గడ్కరీ.ప్రస్తుతం దేశంలో బైక్‌ల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ బైక్‌ల వాటా కేవలం 2శాతం మాత్రమే… 2030 నాటికి దీన్ని 80శాతానికి చేర్చాలని కేంద్రం భావిస్తోంది. అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకుంటోంది. అయితే ఇటీవల వరుసగా ప్రమాదాలు (EV Scooters Catch Fire) చోటుచేసుకుంటున్నాయి. భారీగా వాహనాలు తగలబడుతున్నాయి. బ్యాటరీలు పేలుతున్నాయి. దీంతో వీటి భద్రతపై అనుమానాలు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం రంగంలోకి దిగింది.
ఇటు నిన్న నిజామాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ పేలి ఓ వ్యక్తి చనిపోయిన ఘటనపై ప్యూర్ ఈవీ(Pure EV) స్పందించింది. ఇటీవల చెన్నై, ఇప్పుడు నిజామాబాద్‌లో ఘటనలపై స్పందించింది ఆ సంస్థ. రెండు మోడళ్లకు చెందిన 2 వేల వాహనాలను వెనక్కు పిలవాలని నిర్ణయించింది. బ్యాటరీలను పూర్తిగా చెక్ చేశాకే ఆ వాహనాలను వెనక్కు పంపుతామని తెలిపింది. డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా ప్రతి కస్టమర్‌ను కాంటాక్ట్ అవుతామని యచెప్పింది ప్యూర్ ఈవీ.