New Delhi, SEP 11: సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం శుభవార్త చెప్పింది. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు (Senior Citizens) ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన’ (Ayushman Bharat Scheme ) కింద బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. దాదాపు 4.5 కోట్ల కుటుంబాలు ఈ పథకం కిందకు వస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwani Kumar) తెలిపారు. ఇందులో ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు. ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (Pradhan Manthri Jan Arogya Yojana) కింద 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ కొత్త కార్డులను జారీ చేయనున్నది.
ఈ పథకం కింద 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు.. ఇప్పటికే పథకం కింద ఉన్న కుటుంబాలకు చెందిన వారు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు అదనపు బీమా రక్షణ పొందనున్నారు. ఈ అదనపు బీమా కవరేజ్ 70 ఏళ్లలోపు వారికి మాత్రం వర్తించదు. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బీమా పథకం. దీని కింద ప్రస్తుతం 40శాతం మంది పేదలకు ఏటా 5లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ఇప్పుడు ఈ పథకం 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. కానీ, పేద రోగుల కవరేజీ కూడా రూ.10లక్షలకు పెరుగనున్నది.