Sunita Kejriwal Holds Maiden Poll Roadshow in Delhi (Photo Credits: X/@AamAadmiParty)

New Delhi, April 27: సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌ (Sunita Kejriwal) ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) జైలుకెళ్లడంతో.. పార్టీ వ్యవహారాలను చక్కబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారామె. అంతేకాదు కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) బదులుగా ఆమెనే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈస్ట్ ఢిల్లీలోని కొండ్లి ఏరియాలో క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు సునీతా కేజ్రీవాల్. ఢిల్లీ ప్రజల కోసం కేజ్రీవాల్‌ ఎంతో చేశారని.. అందుకే ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు సునీతా కేజ్రీవాల్. పేదలకు చేస్తున్న మంచిని చూసి ఓర్వలేకే జైల్లో పెట్టారని ఆరోపించారు. కేజ్రీవాల్ షేర్ అని.. ఆయనను ఎవరూ ఏం చేయలేరన్నారు సునీతా కేజ్రీవాల్.

 

ఇండియా కూటమిలో (India) భాగంగా ఉన్న ఆప్‌..ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గుజరాత్‌లో సీట్ల షేరింగ్‌లో పోటీ చేస్తోంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో సునీతా కేజ్రీవాల్ ప్రచారం చేస్తారని ఆప్ నేతలు చెప్తున్నారు. అరెస్ట్ చేసి కేజ్రీవాల్‌ను ప్రచారంలో పాల్గొనకుండా చేయాలని బీజేపీ వేసిన ప్లాన్ సక్సెస్ కాలేదంటున్నారు ఆప్ నేతలు. సునీతా కేజ్రీవాల్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ వెంటే ఉన్నారన్నారు ఆప్ నేతలు.

మరోవైపు లోక్‌సభ ఎన్నికల కోసం​ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వార్‌రూమ్‌ను ఏర్పాటు చేసింది ఆప్. వార్‌రూమ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన 12 టీమ్‌లు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ప్రచారాన్ని సమన్వయం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటాయి. లిక్కర్‌ కేసులో అరెస్ట్ అయి కేజ్రీవాల్‌ తీహార్‌ జైలులో ఉన్నారు. జైల్‌కా జవాబ్‌ ఓట్‌సే పేరుతో ఆప్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది.