New Delhi, JAN 03: ఢిల్లీ మద్యం స్కాం మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు (Aravind Kejriwal) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు మూడవసారి సమన్లు జారీ చేశారు. ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జనవరి 3న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు (Aravind Kejriwal) విచారణ సంస్థ సమన్లు పంపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లకు ప్రతిస్పందనగా, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తాను విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే ఈడీ (ED) తనకు నోటీసు జారీ చేయడం చట్టవిరుద్దమని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Delhi CM Arvind Kejriwal will not go to the ED office today, CM wrote to ED.
"Ready to cooperate in ED investigation but the agency's notice is illegal. Their intention is to arrest Arvind Kejriwal. They want to stop him from election campaign: AAP https://t.co/Wh1GzkDAK4
— ANI (@ANI) January 3, 2024
ఎన్నికల ప్రచారం నుంచి కేజ్రీవాల్ ను నిరోధించేందుకు తమ పార్టీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి దర్యాప్తు సంస్థ ఉద్దేశించిందని ఆప్ ఆరోపించింది.ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆప్ (AAP) అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ తెలిపింది. గత ఏడాది నవంబర్ 2, డిసెంబరు 21వతేదీల్లో ఈడీ రెండుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ, ఫెడరల్ ఏజెన్సీ ముందు హాజరు కావడానికి సీఎం నిరాకరించారు. రాజకీయ ప్రేరణతోనే తనకు మూడోసారి ఈడీ సమన్లు పంపించిందని కేజ్రీవాల్ ఆరోపించారు.