astrology

అక్టోబర్ రెండున బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. సూర్యుడు బుధుడు రెండు గ్రహాలు, కన్యారాశిలోకి ప్రవేశిస్తాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్యుడు ,బుధ గ్రహ సంయోగాన్ని బుధాదిత్య యోగం అని అంటారు. ఇది చాలా శుభకరం. అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది, ముఖ్యంగా ఈ మూడు రాశుల వారు ధనవంతులు అవుతారు, ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి- సూర్యుడు ,బుధుడి సంయోగం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దానివల్ల ఈ కర్కాటక రాశి వారికి వ్యాపారంలో అన్ని శుభాలు జరుగుతాయి. ముఖ్యంగా మీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త కొత్త వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం లభిస్తుంది. దీని ద్వారా మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. విదేశీ పర్యటనలు విజయవంతం అవుతాయి. నూతన వ్యక్తులను కలుస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పటినుంచి ఉన్న గొడవలు తగ్గిపోతాయి. విద్యార్థులు వారి విద్య పట్ల ఆసక్తిని చూపుతారు. దీని వల్ల వారు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.

Vastu Tips: వ్యాపారంలో నష్టం తట్టుకోలేక పోతున్నారా

కన్యా రాశి- ఈ రాశి వారికి బుధాదిత్య యోగం వల్ల ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ సమయం మీకు చాలా అనుకూలమైనది వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనువైన సమయం. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న కోర్టు సమస్యల నుండి బయటపడతారు.

మకర రాశి- ఈ రాశి వారికి కొత్త సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇది నూతన సమయం. దీని ద్వారా మీరు వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. కళలు ,సాహిత్య రంగంలో ఉన్నవారికి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ వివాహాలకు అనుకూలం మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. మీరు పని చేసే చోట మీపై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఎప్పటినుంచ ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుండి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.