astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 3 న వృషభ రాశిలోకి గురు గ్రహం, శుక్ర గ్రహం రెండు కూడా ప్రవేశిస్తున్నాయి. దీని కారణంగా సమాసప్తక యోగం ఏర్పడుతుంది. ఇది జ్యోతిష్య శాస్త్రంలో చాలా శుభయోగంగా చెప్పవచ్చు. వీటి కలయిక వల్ల అన్ని రాశుల పైన సానుకూల ప్రభావాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి- గురు గ్రహ శుక్రుడు కలయిక వల్ల అన్ని శుభప్రహ్లాదలు కలుగుతాయి. అంతేకాకుండా సంస్థ యొక్క యోగం వల్ల ఈ రాశి వారికి అనేక లాభాలు ఉంటాయి. వీరు ఏ పని చేసిన క్రమశిక్షణతో పూర్తి చేస్తారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మీకు ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలలో విజయాన్ని సాధిస్తారు. లాటరీల్లో గెలుపొందుతారు. వారసత్వంగా వచ్చే ఆస్తి ఆకస్మికంగా వస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు.  ఇబ్బంది పడుతున్న సమస్య నుండి బయటపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో సాధిస్తారు. సామాజికంగా ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు ఏవి ఉండవు.

Astrology: నవంబర్ 7వ తేదీన శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం..

కన్యారాశి- వృషభ రాశిలోకి గురు గ్రహం ,శుక్ర గ్రహం కలయిక వల్ల ఈ రాశి వారికి అనేక లాభాలు ఉన్నాయి, అంతేకాకుండా సమాసప్తక యోగం వల్ల అనేక సుఖాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వీరులో సమాజం పట్ల ప్రజాధరణ పెరుగుతుంది. కమ్యూనికేషన్ సామర్థ్యం పెరుగుతుంది. దీని ద్వారా వ్యాపార సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారం కోసం కొత్త రుణాలు తీసుకునే అవకాశాలు ఏర్పడతాయి. పెండింగ్లో ఉన్న పనులను తొందర్లోనే పూర్తి చేస్తారు. నిలిచిపోయిన సమస్యల నుండి బయటపడతారు. విద్యార్థులు చదువుల్లో విజయాన్ని సాధిస్తారు. ప్రాజెక్టులో మీరు అవార్డులను పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. ప్రేమ వివాహాలకు అనుకూలము ఆందోళన ఒత్తిడి మానసిక ధైర్యంగా ఉంటారు.

వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి సమాసప్తక యోగం వల్ల అన్ని శుభప్రదం ఫలితాలు ఉన్నాయి. వారు వారి ఎంచుకున్న రంగాలలో విజయాలను సాధిస్తారు. దీని ద్వారా అనేక అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా మునుపటి కంటే ప్రశాంతంగా ఉంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సానుకూల ప్రభావాలు మీ పనుల పైన ఉంటాయి. కొత్తగా ఆదాయ వనరులు అవకాశాలు లభిస్తాయి. మీ వ్యాపార విస్తరణ కోసం విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వామ్య వ్యాపార ఒప్పందంలో విజయవంతం అవుతాయి. సమావేశంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. దీని కారణంగా విదేశాల్లో చదువుకోవడానికి వీరికి సీటు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాద ఆహ్లాదకరంగా ఉంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.