astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలలో ప్రేమకు సంపదకు కలలకు బాధ్యత వహించే గ్రహంగా శుక్ర గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. శుక్ర గ్రహం ప్రతి 27 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంది. అయితే శుక్రుడు అక్టోబర్ 26వ తేదీన రెండుసార్లు రాసి మారడం ద్వారా 12 రాశుల వారికి అనుకూల ప్రయోజనాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి- కర్కాటక రాశి వారికి శుక్ర గ్రహం రాశి మార్పు కారణంగా అనేక సానుకూల మార్పులు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. ఇది వారిని ఒత్తిడి నుండి బయట పడేస్తుంది. ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడేస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకునే వారికి ఇది శుభ సమయం. భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తొలగిపోతాయి విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళతారు.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో డబ్బులను ఎక్కడ దాచుకోవాలి, 

సింహరాశి- సింహ రాశి వారికి శుక్రుని సంచారం కారణంగా మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులకు శుభకార్యాలకు లో పాల్గొంటారు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న తలనొప్పి సమస్య నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. మీరు పని చేసే చోట మీ యజమాని నుండి అభినందనలు పొందుతారు ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఎప్పటినుంచో ఉన్న అనారోగ్య సమస్య నుండి బయటపడతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేయాలని కల నెరవేరుతుంది.

తులారాశి- తులారాశి వారికి శుక్రుడి రాశి మార్పు కారణం చాలా సానుకూల ఫలితాలను ఇస్తుంది. పట్టుదలతో చేసే ప్రతి పని కూడా మీకు విజయాన్ని అందిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇంట్లో వాతావరణం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. మీ స్నేహితులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. విదేశాల్లో పెట్టబడులు పెట్టాలనుకునే నెరవేరుతుంది. దీని ద్వారా ఆర్థిక పరంగా లాభాలు వస్తాయి. ఆర్థిక లాభాలు పెరుగుతాయి. కెరీర్లో పురోగతి పొందుతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.