జ్యోతిష శాస్త్రంలో రాహు కేతువులకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు గ్రహాలు కూడా తమ రాశులను మార్చుకున్నప్పుడు 12 రాశుల పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. వీరికి జీవితంలో ఆనందం శాంతి తగ్గుతుంది. రకరకాల అనారోగ్య సమస్యలు. ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా నష్టాలు వస్తాయి. అయితే ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి- రాహు కేతు కలయిక వల్ల ఈ రాశి వారికి కొన్ని ఆర్థికపరమైన నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు పనిచేసే చోట విశ్వాస కోల్పోతారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు.
Vastu Tips: నల్లచీమలు ఇంట్లో కనిపిస్తే మంచిదేనా,
మిథున రాశి- మిధున రాశి వారికి రాహు ,కేతువుల కలయిక వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు చదువు పైన ఆసక్తి తగ్గుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు కాస్త ఆగాలి లేకపోతే నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చు పెరుగుతుంది ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు కుటుంబం సభ్యుల మధ్య గొడవలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అనుకోని తగాదాలు ఏర్పడడం. సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని పేదవారికి బియ్యం లేదా పంచదారను దానం చేయడం ద్వారా ఈ సమస్యలు తగ్గుతాయి.
సింహరాశి- రాహు ,కేతువు కలయిక వల్ల ఈ రాశి వారికి కొన్ని అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు పని చేసే చోట పై అధికారుల నుండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. స్నేహితులతో కలిసి ఎటైనా వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. వ్యాపార పరంగా కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి నోటితోటి అప్రమత్తంగా ఉండండి. గణపతిని పూజించి పశువులకు ఆహారం అందించడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.