astrology

జ్యోతిష శాస్త్రం ప్రకారం న్యాయానికి అధిపతి అయిన శని గ్రహంగా పరిగణిస్తారు. శని దేవుని దయ ఉండడం వల్ల జీవితంలో అనేక లాభాలను పొందుతారని నమ్ముతారు. అయితే అక్టోబర్ 29న శని కుంభరాశిలోకి ప్రవేశం. దీని కారణంగా త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఇది మార్చ్ 29 వరకు ఉంటుంది. ఇది 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి- వృషభ రాశి వారికి త్రికోణ రాజయోగం చాలా లాభాలను కలిగిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా అదృష్టం మీ వైపే ఉంటుంది. దీని కారణంగా మీకు ఆర్థికంగా ఎటువంటి నష్టం ఉండదు. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి వ్యాపారస్తులకు అనువైన సమయం. మీ వ్యాపార విస్తరణకు డబ్బును పెట్టడం ద్వారా అధికంగా లాభాలు వస్తాయి. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. పెళ్లి కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ వివాహాలకు మీ కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది.

Vastu Tips: ఈ వస్తువులు పర్సులో పెట్టుకుంటే డబ్బుకు ఇబ్బంది ఉండదు ...

కర్కాటక రాశి- కర్కాటక రాశి వారికి త్రికోణ రాజయోగం వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అధికంగా లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు రానున్న రోజుల్లో ప్రమోషన్ పెరిగి జీతం రెట్టింపు అవుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. దీని ద్వారా మీ మనసు సంతోషంగా ఉంటుంది. ఎప్పటినుంచ ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుండి బయటపడతారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

ధనస్సు రాశి- ధనస్సు రాశిలో జన్మించిన వారికి శని సంచారం కారణంగా త్రికోణయ్య రాజయోగం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది.మీ వైవాహిక జీవితంలో కొనసాగుతున్న గొడవలు పరిష్కారం అవుతాయి. కెరీర్లో పురోగతి వస్తుంది దీంతో మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ పెరుగుతుంది .దీని ద్వారా మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులు స్కాలర్షిప్ పొందుతారు. దీని ద్వారా వారికి ఆర్థిక సమస్యలు ఉండవు. దీని ద్వారా వారు ఆనందంగా ఉంటారు. కోర్టు సమస్యల నుండి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.