ఈ సంవత్సరం లో వచ్చే చివరి సూర్యగ్రహణం అక్టోబర్ రెండో తేదీన వస్తుంది. సూర్యగ్రహణం అక్టోబర్ రెండో తేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ 3 తెల్లవారుజామున వరకు ఉంటుంది. ఈ సూర్యగ్రహణం వల్ల అన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి- మేషరాశి వారికి సూర్యగ్రహణం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి. రాబోయే రోజుల్లో వీరి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మీరు పిల్లల నుండి శుభవార్తలను వింటారు. మీ కెరీర్ లో అడ్డంకులన్నీ తొలగిపోయి ముందుకు వెళతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. దీని ద్వారా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు ఏ పని చేయాలనుకున్న అందులో కష్టపడి పని చేసి విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి విదేశీ పర్యటనలు చేస్తారు.
Vastu Tips: ఈ వస్తువులు పర్సులో పెట్టుకుంటే డబ్బుకు ఇబ్బంది ఉండదు
తులారాశి- ఈ రాశి వారికి సూర్యగ్రహణం వల్ల అక్టోబర్ 2న నుండి వీరికి సానుకూల ప్రభావాలు ఉంటాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీని ద్వారా ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు పని చేసే చోట మీ యజమాని నుండి ప్రశంసలు అందుకుంటారు. విహారయాత్రలకు కుటుంబ సభ్యులతో వెళతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశాలు వస్తాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
కుంభరాశి- ఈ రాశి వారికి సూర్యగ్రహణం నుండి సానుకూల ఫలితాలు లభిస్తాయి. మీ కెరీర్లో పురోగతి పొందుతారు. మీరు పని చేసే చోట మీ సహోదయోగుల నుండి మద్దతు లభిస్తుంది. సంపద పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పటినుంచో ఉన్న వివాదాలు
తొలగిపోతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.