New Delhi, April 21: భారత దేశంలో చికిత్స తీసుకునేందుకు వచ్చే విదేశీయుల కోసం ‘ఆయుష్ వీసా’ (Ayush visa)ను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. గుజరాత్ (Gujarat), గాంధీనగర్‌లో (Gandhi Nagar) జరిగిన ‘గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సదస్సు-2022’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో మెడిసిన్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా సంప్రదాయ దేశీ వైద్య విధానాన్ని (Ayush Sector) ప్రోత్సహిస్తామన్నారు. ‘‘త్వరలో రానున్న ‘ఆయుష్ వీసా’ ద్వారా దేశంలో ఆయుష్ థెరపీ తీసుకునేందుకు వచ్చే విదేశీయుల ప్రయాణం సులభతరమవుతుంది.

‘డిజిటల్ పోర్టల్’ (Digital portal) ద్వారా దేశంలో వైద్య సంబంధమైన మొక్కలు పెంచే రైతులను, ఆయుష్ ఉత్పత్తుల తయారీదారులను ప్రోత్సహిస్తాం. కోవిడ్ సమయంలో ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ఎన్నో ఆయుష్ ఉత్పత్తులు (Ayush Produts) ఉపయోగపడ్డాయి.

Coronavirus: మళ్లీ కరోనా ఆంక్షలు అమల్లోకి, మాస్క్‌ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే రూ. 500 జరిమానా, ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనావైరస్ కేసులు

ముఖ్యంగా ఈ సమయంలో దేశం నుంచి పసుపు ఎగుమతులు పెరిగాయి. అందుకే ఈ రంగంలో పెట్టుబడులు, అవకాశాల్ని పెంచుకోవాలి. సంప్రదాయ వైద్య రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం’’ అని వ్యాఖ్యానించారు మోదీ.