UP Police officials inspect the house of the deceased children in Budaun (Photo Credit: ANI)

Budaun, March 20: యూపీలో(Uttar Pradesh)ని బుద్వాన్‌లో దారుణం జ‌రిగింది. ఓ వ్య‌క్తి ఇద్ద‌రు పిల్ల‌ల్ని న‌రికి చంపాడు. క‌త్తితో అటాక్ చేసిన ఘ‌ట‌న‌లో (Barber murders 2 children) మ‌రో పిల్లాడు గాయ‌ప‌డ్డాడు. బాబా కాల‌నీలో ఈ ఘట‌న జ‌రిగింది. అయితే కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆ ఉన్మాదిని పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు. ఈమ‌ధ్యే ఆ వ్య‌క్తి బాబా కాల‌నీలో బార్బ‌ర్ షాపును ఓపెన్ చేశాడు. అయితే అక‌స్మాత్తుగా ఓ ఇంట్లోకి చొర‌బ‌డి ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు అన్నాద‌మ్ముళ్ల‌పై అటాక్ చేశాడు. ఆ దాడిలో ఆయుష్‌, అహాన్ అనే ఇద్ద‌రు పిల్ల‌లు చ‌నిపోయారు. యువ‌రాజ్ అనే పిల్లోడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

 

మండీ పోలీసు పోస్టు స‌మీపంలోనే ఈ ఘ‌ట‌న జ‌రిగింది. నిందితుడిని 22 ఏళ్ల సాజిద్‌గా గుర్తించారు. కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో అత‌న్ని కాల్చి చంపిన‌ట్లు (encounter) బ‌రేలీ రేంజ్ ఐజీ ఆర్కే సింగ్ తెలిపారు. పిల్ల‌ల్ని చంపిన త‌ర్వాత ర‌క్త‌పు దుస్తుల్లోనే వెళ్లిపోయాడు. పోలీసులు అత‌ని ఆచూకీ తెల‌సుకుని వెంటాడారు.

 Suicide Bid Video: వీడియో ఇదిగో, సూసైడ్ చేసుకునేందుకు మూడవ అంతస్తు నుండి దూకిన వడపావ్ వ్యాపారి, వలలో పడటంతో.. 

షేక్‌పురా ఫారెస్ట్ వ‌ద్ద అత‌న్ని గుర్తించారు. పిల్ల‌ల ఇంటికి వెళ్లి అమ్మ‌మ్మ‌ను క‌లిసిన త‌ర్వాత ఆ ఉన్మాది సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న పిల్ల‌ల వ‌ద్ద‌కు వెళ్లాడ‌ని ఐజీ తెలిపారు. అటాక్‌ త‌ర్వాత పిల్లల కుటుంబ స‌భ్యులు, స్థానికులు.. స‌మీపంలో ఉన్న షాపుల‌ను ధ్వంసం చేశారు. మంగ‌ళ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు దాడి జ‌రిగిన‌ట్లు డీజీపీ ప్ర‌శాంత్ కుమార్ తెలిపారు.