
Ranchi January 14: కరోనా వ్యాక్సిన్(Corona Vaccine)తో మొండిరోగాలు నయమవుతున్నాయన్న వార్తలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమకు వినికిడి శక్తి పెరిగిందని, కంటి చూపు మెరుగైందని చాలా మంది చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అలాంటి వార్తే మరొకటి హల్ చల్ చేస్తోంది. నాలుగేండ్లుగా మంచానికే పరిమితమైన ఒక వ్యక్తి కరోనా వ్యాక్సిన్ (Vaccine)తో కోలుకున్నాడు. టీకా తీసుకున్న తర్వాత తన కాళ్లలో కదలిక(starts walking) వచ్చిందని తెలిపాడు.
ఈ వింత ఘటన జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో జరిగింది. బొకారోలోని సల్గాడిహ్ గ్రామానికి చెందిన దులార్‌చంద్ (Dular chand) రోడ్డు యాక్సిడెంట్ కారణంగా సుమారు 4 సంవత్సరాలుగా మంచంపైనే (Bedridden ) ఉన్నాడు. కాగా, అతడు ఇటీవల కరోనా టీకా తీసుకున్నాడు. అయితే కోవిషీల్డ్ డోస్ (Covishield) తీసుకున్న తర్వాత పక్షవాతం పోయిందని దులార్‌చంద్ తెలిపాడు. ‘వ్యాక్సిన్ తీసుకున్నందుకు ఆనందంగా ఉంది. జనవరి 4న వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుంచి నా కాళ్లలో కదలిక వచ్చింది’ అని చెప్పాడు.
మరోవైపు ఈ సంగతి తెలుసుకున్న డాక్టర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నాలుగు ఏండ్లగా పక్షవాతంతో ఉన్న వ్యక్తి టీకా తీసుకున్న తర్వాత ఆకస్మాత్తుగా కోలుకోవడం నమ్మశక్యంగా లేదని బొకారోకు చెందిన సివిట్ జర్జన్ డాక్టర్ జితేంద్ర కుమార్ అన్నారు. శాస్త్రీయంగా దీనిని నిర్ధారించాల్సి ఉందని ఆయన చెప్పారు.