Kolkata Doctor Rape-Murder Case

Kolkata, SEP 19: పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ (WBMC) గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ (RG Kar’s ex-principal) డాక్టర్‌ సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసింది. 31 ఏళ్ల ట్రైనీ లేడీ డాక్టర్‌పై హత్యాచారం కేసుతో పాటు ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆయనను అరెస్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ కస్టడీలో ఉన్న డాక్టర్‌ సందీప్ ఘోష్‌ను రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల జాబితా నుంచి తొలగించినట్లు డబ్ల్యూబీఎంసీ తెలిపింది. బెంగాల్ మెడికల్ యాక్ట్ 1914 నిబంధనల ప్రకారం ఆయన లైసెన్స్ రద్దు చేసినట్లు పేర్కొంది.

Telangana Shocker: హైదరాబాద్‌లో దారుణం, మద్యం మత్తులో ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి చంపిన వ్యక్తి..షాకింగ్ వీడియో  

కాగా, ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్‌ సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ (WBMC)ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) గతంలో కోరింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూబీఎంసీ చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ 7న ఘోష్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయన రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. అయితే ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సందీప్ ఘోష్ ఈ నోటీస్‌కు స్పందించలేదు. ఈ నేపథ్యంలో బెంగాల్ మెడికల్ యాక్ట్ నిబంధనల ప్రకారం ఆయన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు డబ్ల్యూబీఎంసీ వెల్లడించింది.