Bengaluru: బెంగళూరులో కోటి రూపాయల ఫేక్ కరెన్సీ, అమెరికా డాలర్లు, భారత్‌ కరెన్సీ నకిలీ నోట్లు ముద్రిస్తున్న ఇంటిపై దాడుల చేసిన పోలీసులు

కర్ణాటక రాజధాని బెంగళూరులో అమెరికా డాలర్లు, భారత్‌ కరెన్సీ నకిలీ నోట్లు ముద్రిస్తున్న ఇంటిపై బెంగళూరు సీసీబీ పోలీసు­లు (Bengaluru police) బుధవారం దాడి చేశారు. పెద్దమొత్తంలో నకిలీ కరెన్సీ స్వాధీనం (fake currency notes worth over Rs 1 crore) చేసుకున్నారు.

Bengaluru: బెంగళూరులో కోటి రూపాయల ఫేక్ కరెన్సీ, అమెరికా డాలర్లు, భారత్‌ కరెన్సీ నకిలీ నోట్లు ముద్రిస్తున్న ఇంటిపై దాడుల చేసిన పోలీసులు
Indian Currency (Photo-ANI)

Bengaluru, Dec 15: కర్ణాటక రాజధాని బెంగళూరులో అమెరికా డాలర్లు, భారత్‌ కరెన్సీ నకిలీ నోట్లు ముద్రిస్తున్న ఇంటిపై బెంగళూరు సీసీబీ పోలీసు­లు (Bengaluru police) బుధవారం దాడి చేశారు. పెద్దమొత్తంలో నకిలీ కరెన్సీ స్వాధీనం (fake currency notes worth over Rs 1 crore) చేసుకున్నారు. నగర జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.­డి.శరణప్ప తెలిపిన వివరాల ప్రకారం... హెణ్ణూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఒక ఇంట్లో భారత్, అమెరికా నకిలీ కరెన్సీ ముద్రించి మార్కెట్లోకి పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్న­ట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు ఆ ఇంటిపై దాడి చేశారు.

ఈ ఏడాది పోర్న్ హబ్ రివ్యూ వచ్చేసింది, అబెల్లా డేంజర్ సెక్స్ వీడియోల కోసం అల్లాడిన పురుషులు, యువత జపనీస్ వీడియోలు కోసం, మహిళలు లెస్బియన్ వీడియోల కోసం తెగ వెతికారట

అయితే అప్పటికే ఇద్దరు నిందితులు అక్కడి నుంచి జారుకున్నారు. ఇంట్లో గాలించగా భారత్‌కు చెంది­న రూ.500 నోట్లు 10,033, అమెరికాకు చెందిన వంద డాలర్ల నోట్లు 708 లభించాయి. అలాగే మరికొంత మొత్తంలో వెయ్యి రూపాయల పాత నోట్లు, ముద్రణకు వాడే రసాయ­నాల సీసాలు, నాలుగు కలర్‌ ప్రింటర్లు, ఇంక్‌జెట్‌ ఎల్రక్టానిక్‌ డైయింగ్‌ మెషిన్‌ తదితరాలు అక్కడ దొరికాయి. ఇప్పటివరకు ఎంత మొత్తంలో నోట్లను మార్కెట్లోకి తీసుకువెళ్లారనేది తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Dec 15, 2022 03:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).