Hidden Cameras (Representational Image; Photo Credit: pixabay)

Bengaluru, AUG 11: బెంగ‌ళూరులోని ఓ ప్ర‌ముఖ కాఫీ షాపులో ప‌ని చేస్తున్న ఓ ఉద్యోగి అత్యంత నీచ‌మైన చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. లేడీస్ వాష్‌రూమ్‌లోని (Ladies Washroom) డ‌స్ట్‌బిన్‌లో సెల్‌ఫోన్‌ను (Hidden Camera) ఉంచాడు. ఆ మొబైల్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచి, కెమెరాను ఆన్ చేసి వీడియో రికార్డు చేశాడు. దీన్ని గ‌మ‌నించిన ఓ మ‌హిళ‌.. కాఫీ షాపు యాజ‌మాన్యానికి ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫోన్ కెమెరా దాదాపు రెండు గంట‌ల పాటు రికార్డింగ్ మోడ్‌లో ఉన్న‌ట్లు తేలింది. అయితే కెమెరాకు ఏమీ అడ్డురాకుండా సంచికి చిన్న రంధం చేసి టాయిలెట్ సీట్ దిశ‌గా ఉంచిన‌ట్లు బాధిత మ‌హిళ తెలిపారు. ఈ వ్య‌వ‌హారాన్ని గ్యాంగ్స్ ఆఫ్ సినీపుర్ పేరిట ఉన్న ఓ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్టు చేశారు.

Telangana Shocker: రిపేర్‌కు ఇచ్చిన ఫోన్ ఇవ్వలేదని బ్లెడ్‌తో కోసుకున్న వ్యక్తి, ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన, ఆస్పత్రికి తరలింపు 

బీఈఎల్ రోడ్‌లోని థ‌ర్ద్ వేవ్ కాఫీ ఔట్‌లెట్‌లో (Coffee Outlet) ఈ ఘటన చోటు చేసుకున్న‌ట్లు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. బెంగళూరులోని థర్డ్‌ వేవ్ కాఫీ ఔట్‌లెట్‌లో నేను ఉన్నాను. ఆ సమయంలోనే ఓ మహిళకు వాష్‌రూమ్‌లోని డస్ట్‌బిన్‌లో మొబైల్ కనిపించింద‌ని ఆమె తెలిపింది. ఫోన్ కనిపించకుండా చాలా జాగ్రత్తగా అందులో దాచిపెట్టారు. దాదాపు 2 గంటల పాటు వీడియో రికార్డ్ అయింది. ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టడం వల్ల అక్కడ మొబైల్ ఉన్నట్టు ఎవరికీ తెలియలేదు. కెమెరా మాత్రం కనిపించేలా డస్ట్‌ బిన్‌కి ఓ రంధ్రం పెట్టారు. కెమెరాను గుర్తించిన‌ ఆ మహిళ కాఫీ షాపు యాజ‌మాన్యానికి చెప్పింది. అక్కడ పని చేస్తున్న ఉద్యోగి ఈ పని చేసినట్టు తేలింది. పోలీసులు వెంటనే వచ్చి ఆ వ్యక్తిని విచారించారు. కఠిన చర్యలు తీసుకుంటామని కాఫీ షాపు యాజ‌మాన్యం చెప్పిన‌ట్లు గ్యాంగ్స్ ఆఫ్ సినీపుర్ ఇన్‌స్టా ఖాతాలో పేర్కొన్నారు.

ఈ ఘ‌ట‌న‌పై స‌ద‌రు కాఫీ విక్ర‌య సంస్థ స్పందించింది. జ‌రిగిన ఘ‌ట‌న‌పై విచారం వ్య‌క్తం చేసింది. త‌మ ఔట్‌లెట్ల‌లో ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. స‌ద‌రు వ్య‌క్తిని వెంట‌నే ఉద్యోగంలో నుంచి తీసేసిన‌ట్లు పేర్కొంది. ఈ సంస్థ‌కు దేశ వ్యాప్తంగా ఔట్‌లెట్లు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ దారుణానికి పాల్ప‌డ్డ వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు.