Bhandara, January 9: మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని భండారా జిల్లా ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో (Bhandara Hospital Fire) 10మంది పిల్లలు మరణించారు. భండారా జిల్లా ఆసుపత్రిలోని (Bhandara Hospital) పిల్లలున్న కేర్ యూనిట్ (ఎస్ఎన్‌సియూ) లో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 17 మంది పిల్లలుండగా వారిలో ఏడుగురిని రక్షించారు.
ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో డ్యూటీలో ఉన్న ఓ నర్సు గదిలో పొగ రావడం గుర్తించింది. ఆ తర్వాత నర్సు ఆసుపత్రి అధికారులను అప్రమత్తం చేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదంలో పదిమంది పిల్లలు మరణించడంతో భండారా ఆసుపత్రిలో విషాదం అలముకుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
The fire accident in Bhandara district hospital, Maharashtra is very unfortunate. I am pained beyond words. My thoughts and condolences are with bereaved families. May God give them the strength to bear this irreparable loss.
— Amit Shah (@AmitShah) January 9, 2021
ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. మాటలకు అందని విషాదం అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.
The unfortunate incident of fire at Bhandara District General Hospital in Maharashtra is extremely tragic.
My condolences to the families of the children who lost their lives.
I appeal to Maha Govt to provide every possible assistance to the families of the injured & deceased.
— Rahul Gandhi (@RahulGandhi) January 9, 2021
బంఢారా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఘటన విషాదకరమైందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.