
New Delhi, SEP 03: గతేడాది కన్యా కుమారి నుంచి శ్రీనగర్ వరకు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహించిన భారత్ జోడో యాత్ర తొలి వార్షికోత్సవం (Anniversary) సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Padyatra) ప్రారంభించిన సెప్టెంబర్ ఏడో తేదీన జిల్లాలో ‘భారత్ జోడో పాదయాత్ర’లు నిర్వహించాలని నిర్ణయించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సూచన మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. పీసీసీలకు సందేశం ఇచ్చారు. దేశంలోని అన్ని జిల్లాల్లో ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు కాంగ్రెస్ పార్టీ నేతలు పాదయాత్రలు నిర్వహిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
గతేడాది సెప్టెంబర్ ఏడో తేదీన కన్యా కుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ప్రారంభించారు. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా రాహుల్ గాంధీ ఈ ఏడాది జనవరి 30న శ్రీనగర్‌లో యాత్ర ముగించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మీదుగా 4080 కి.మీ. మేర రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగింది.