Bihar Road Accident: బీహార్‌‌లో ఆటోను ఢీకొన్న ట్రక్కు, ఐదుగురు అక్కడికక్కడే మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు, మరో రాష్ట్రం యూపీలో సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు బాలికలు మృతి
Representational Image | (Photo Credits: IANS)

Patna, August 9: బీహార్‌లోని అరారియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరారియా వద్ద సోమవారం ఉదయం ఓ ఆటోను ట్రక్కు (Bihar Road Accident) ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి (5 killed, 6 injured) చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికు తరలించారు. ఇక గుజరాత్ రాష్ట్రంలో జరిగిన మరో ప్రమాదంలో.. ఇద్దరు చిన్నారులు సహా ఎనిమిది మృతి చెందారు. గుజరాత్‌లోని అమ్మేలీ జిల్లా బధాడాలో సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఓ టక్కు రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. దీంతో ఎనిమిది మృత్యువాతపడ్డారు. మృతుల్లో 8-13 సంవత్సరాల మధ్య వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

మరో రాష్ట్రం యూపీలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ముగ్గురు బాలికలు మరణించిన ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంఘడ్ పట్టణంలోని అహారౌలా ప్రాంతంలోని ఇమామ్ ఘడ్ గ్రామంలో ఓ మహిళ వంట చేస్తూ, ముగ్గురు బాలికలను వంటగదిలో ఉంచి మంచినీళ్లు తీసుకురావడం కోసం బయటకు వెళ్లింది. అంతలో వంటగదిలోని సిలిండర్ పేలి మంటలు అంటుకొని ముగ్గురు మైనర్ బాలికలు తీవ్రంగా గాయపడ్డారు.

ఘోర రోడ్డు ప్రమాదం, గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు, నిద్రిస్తున్న 8 మంది కూలీలు అక్కడికక్కడే మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, గుజరాత్‌లోని అమ్రేలీ పరిధిలోని బాధ్డా గ్రామంలో విషాద ఘటన

బాలికల హాహాకారాలతో స్థానికులు వచ్చి మంటలను ఆర్పి చూడగా దీపాంజలి (11), శివానీ (6)లు మరణించారు.తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల శ్రేజాల్ అనే బాలికను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ముగ్గురు సోదరిమణులైన చిన్నారులు సిలిండర్ పేలిన ఘటనలో మరణించడంతో విషాదం అలముకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు