Hyd, Aug 28:  నబన్న అభిజన్ నిరసన ర్యాలీలో విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ బీజేపీ 12 గంటల బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ చేపట్టిన బెంగాల్ బంద్ ఉద్రిక్తంగా మారింది. బంద్‌కు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పలు చోట్ల బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. ఇక బంద్ బంద్ సందర్భంగా కొంతమందిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.

పలుచోట్ల దుకాణాలను మూసివేస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బంద్‌ కారణంగా రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. రైళ్ల రాకపోకలతో పాటు విమాన సంస్థలు సైతం ప్రయాణికులకు అలర్ట్‌లు జారీ చేశాయి.మరోవైపు బీజేపీ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బస్సు డ్రైవర్లు కొన్నిచోట్ల హెల్మెట్ పెట్టుకుని నడపాల్సిన పరిస్థితి నెలకొంది.

Here's Video:

 పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని భట్‌పరాలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తన కారుపై దాడి చేశారని బీజేపీ నాయకుడు తెలిపారు. దాదాపు 50-60 మంది వ్యక్తులు నా వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబులు విసిరారని మీడియాతో వెల్లడించారు. బెంగాల్ సీనియర్ పోలీసు అధికారి సమక్షంలోనే ఈ దాడి జరిగిందని బీజేపీ నేతలు తెలిపారు.

ఈ దాడి వెనుక తృణమూల్ నేతలు తరుణ్ సౌ, ఎమ్మెల్యే సోమనాథ్ శ్యామ్ హస్తం ఉందని బీజేపీ నేతలు అర్జున్ సింగ్ ఆరోపించారు. ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై తృణమూల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేస్తోంది. బంద్ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Here's Video:

#WATCH | West Bengal: Police recovered empty bomb shells from near the spot where BJP leader Priyangu Pandey was attacked in Bhatpara of North 24 Parganas

వైద్యవిద్యార్థిని హత్యాచార ఘటనపై బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. తృణమూల్ ఛాత్ర పరిషత్ వ్యవస్థాపక దినోత్సవాన్ని బాధితురాలికి అంకితం చేస్తున్నట్లు మమతా బెనర్జీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆగస్టు 9 నాటి ఘటనకు తక్షణ పరిష్కారాన్ని ఆశిస్తున్నట్లు మమత తెలిపారు.

Here's Tweet: