
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు. మహ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో బీజేపీ ఆమెపై ఈ చర్య తీసుకుంది. నవీన్ కుమార్ జిందాల్‌ను కూడా పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు. నవీన్ కుమార్ జిందాల్ ఢిల్లీ బీజేపీ మీడియా హెడ్ గా ఉన్నారు.
BJP suspends Nupur Sharma and Naveen Jindal from party's primary membership pic.twitter.com/QkqkvMdLNF
— ANI (@ANI) June 5, 2022
ఈ ఇద్దరు నేతలపై పార్టీ చర్యలు తీసుకున్న తర్వాత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ లేఖ జారీ చేశారు. బీజేపీ అన్ని మతాలను గౌరవించే పార్టీ అని లేఖలో పేర్కొన్నారు. పార్టీ విడుదల చేసిన ప్రకటనలో, వేల సంవత్సరాల భారతదేశ చరిత్రలో ప్రతి మతం అభివృద్ధి చెందిందని పేర్కొంది. ఏ మతానికి చెందిన వ్యక్తినైనా అవమానించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఏ వర్గాన్ని లేదా మతాన్ని అవమానించే భావజాలానికి పార్టీ తీవ్రంగా వ్యతిరేకం అని పేర్కొంది.