Governor Tamilisai Soundararajan

Hyderabad January 30: బాడీ షేమింగ్ (Body shaming) చేస్తున్నవారిపై విరుచుకుపడ్డారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ (Dr Tamilisai Soundarajan). ఇటీవల రిలీజ్‌ అయిన శ్యామ్ సింగరాయ్(Shaym singarai) మూవీలో నేచురల్‌ బ్యూటీ సాయిపల్లవి(Sai Pallavi) దేవదాసిగా కనిపించింది. కెరీర్‌లో తొలిసారి సున్నితమైన పాత్రను పోషించిన ఈ హీరోయిన్‌ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. మరీ ముఖ్యంగా సినిమాలో ఆమె చేసిన డ్యాన్స్‌కు జనాలు మంత్రముగ్ధులవుతున్నారు. ఓ పక్క ఆమె మీద ప్రశంసల జల్లు కురుస్తుంటే.. దేవదాసి (Devadasi) పాత్రలో నటించిన సాయిపల్లవి(Saipallavi) అందంగా లేదు అంటూ తమిళనాట ఓ వార్త ప్రచురితమైంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయ్యాయి. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సాయిపల్లవిపై వచ్చిన వార్తలు బాధించాయంటూ ట్వీట్‌ చేశారు.

ఓ తమిళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సాయిపల్లవి గురించి బాడీ షేమింగ్‌ చేయడం నన్ను ఎంతగానో బాధించింది. గతంలో నా రూపాన్ని గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఎప్పుడూ ట్రోల్‌(Troll) చేసేవారు. అలాంటి మాటలు పడ్డవారికే ఆ బాధంటే ఏమిటో తెలుస్తుంది. బాడీ షేమింగ్‌ చేస్తున్నారని తీవ్రంగా బాధపడ్డాను. కానీ నా ప్రతిభతో, శ్రమతో ఆ మాటలను ఎదుర్కొన్నాను. అలాంటి కామెంట్స్‌ బారిన పడకుండా ఉండటానికి మనమేమీ మహాత్ములం కాదు. నాపై చేసిన కామెంట్స్‌ను నేను పట్టించుకోలేదు. కానీ ఆ ట్రోలింగ్‌ (Trolling)వల్ల బాధపడతారా? అంటే కచ్చితంగా అవుననే బదులిస్తాను'

'పొట్టిగా, నల్లగా, నాలాంటి(రింగుల) జుట్టుతో పుట్టడం మన తప్పేమీ కాదు. వీటన్నింటిలోనూ అందం ఉంది. కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత ఊరికే రాలేదు. కాకి తన పిల్లను బంగారు పిల్లగానే భావిస్తుందే తప్ప నల్లగా ఉందని వదిలిపెట్టదు కదా! మహిళలు బాడీ షేమింగ్‌కు గురవుతారు కానీ పురుషులకు అలాంటి మాటలు ఎదురవవు. 50 ఏళ్ల వయసులో ఉన్న పురుషులను కూడా యువకులుగా చూస్తారు కానీ స్త్రీలను మాత్రం అలా అస్సలు చూడలేరు. స్త్రీల ఎదుగుదలకు అడ్డుపడుతున్న ఈ సమాజం.. మహిళలను బాధపెడుతూ వారి ఎదుగుదలను తగ్గించడానికి యత్నిస్తోంది' అని తమిళిసై చెప్పుకొచ్చారు.