Representational Image (Photo Credits: Pexels)

Rewa, May 11:  కొద్దిసేపట్లో పెళ్లి (Marriage) జరగబోతుండగా పీకలదాకా తాగొచ్చాడు పెళ్లికొడుకు. మద్యం(Liquor) మత్తులో ఉన్న పెళ్లి కొడుకుని (groom) చూసి, అతడ్ని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది పెళ్లి కూతురు(Bride). ఇంకేముంది.. పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రువా జిల్లాలో బుధవారం జరిగింది. రువా జిల్లాలోని (Rewa) నెహ్రూ నగర్‌కు చెందిన నేహాకు(Neha), పీయూష్ మిశ్రాకు (Piyush Misra) పెళ్లి నిశ్చయమైంది. వధువు కుటుంబ సభ్యులు బుధవారం వీళ్ల పెళ్లి జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం పెళ్లి తంతులో భాగంగా వధూవరుల దండలు మార్చే కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో వరుడు తాగి ఉండటాన్ని వధువు నేహా గమనించింది. ఈ సమయంలో వరుడితోపాటు అతడి స్నేహితులు కూడా తాగి ఉన్నారు.

Tamil Nadu: తమిళనాడులో దారుణం, కులం పేరుతో విద్యార్థిని దూషించి మంటల్లోకి తోసేసిన మరికొందరు విద్యార్థులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థి  

అయితే, పెళ్లి రోజే తాగి వచ్చిన వరుడి వ్యవహారశైలిపై వధువు అభ్యంతరం వ్యక్తం చేసింది. తాగొచ్చిన అతడ్ని పెళ్లి చేసుకోనని చెప్పింది. చాలామంది పెద్దలు నేహాకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ, నేహా తన నిర్ణయం మార్చుకోలేదు. చివరకు వధువు నిర్ణయానికి ఆమె కుటుంబ సభ్యులు కూడా మద్దతు తెలిపారు. దీంతో చాలాసేపు చర్చల అనంతరం పెళ్లి రద్దు చేసుకునేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి.

Black Cobras in Pot: ఒకే ఇంట్లో 90 బ్లాక్ కోబ్రాస్, మట్టికుండలో కుప్పలు కుప్పలుగా బయటపడ్డ పాములు, భయాందోళనలో గ్రామస్తులు, మనుషుల్ని తినే జాతికి చెందిన పాములు కావడంతో ఆందోళన  

అయితే, ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. అక్కడ పోలీసుల సమక్షంలో పెళ్లి రద్దుపై ఒప్పందం జరిగింది. పెళ్లికి ముందు వధువు కుటుంబ సభ్యులు ఇచ్చిన నగదు, లాంఛనాలు తిరిగి ఇచ్చేందుకు వరుడి కుటుంబ సభ్యులు అంగీకరించారు. దీంతో పెళ్లి తంతు, శాంతియుతంగా రద్దైంది.