Bomb Threats in Delhi: మొన్న స్కూళ్లు, ఇవాళ ఆస్ప‌త్రులు, ఎన్నిక‌ల వేళ ఢిల్లీలో బాంబు బెదిరింపులు, ప‌లు హాస్ప‌టల్స్ లో బాంబులు పెట్టామంటూ ఈమెయిల్స్
Bomb Threat Email in Delhi (Photo Credit: ANI)

New Delhi, May 12: ఢిల్లీలో మొన్న స్కూళ్లకు (Schools) బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడంతో పెద్ద ఎత్తున తనిఖీలు చేసిన ఘటన మరకవ ముందే ఇప్పుడు ఢిల్లీలోని ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రెండు ఆసుపత్రులకు (Hospitails) బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చినట్లు అధికారులు చెప్పారు. ‘ఢిల్లీ, మంగోల్‌పురిలోని బురారీ (Burari Government Hospital) ప్రభుత్వ ఆసుపత్రితో పాటు సంజయ్ గాంధీ ఆసుపత్రికి (Sanjay Gandhi Hospital) బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది తనిఖీలు జరుగుతున్నాయి’ అని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. కాగా, ఢిల్లీ ఎన్సీఆర్‌లోని పలు స్కూళ్లకు ఇటీవలే బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో అప్పట్లో ఢిల్లీలోని 100 స్కూళ్లను తాత్కాలికంగా మూసేశారు.

 

అనంతరం ఢిల్లీ ఘటన మరవకముందే బాంబు బెదిరింపులతో ఉలిక్కిపడింది గుజరాత్ లోని అహ్మదాబాద్. బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో పోలీసులు అహ్మదాబాద్ లోని స్కూళ్లలోనే తనిఖీలు చేశారు. స్కూళ్ల నిర్వాహకులు టెన్షన్ పడ్డారు. స్కూళ్లకు కూడా రష్యన్‌ సర్వర్‌ నుంచి బెదిరింపు మెయిల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. బెదిరింపు మెయిల్స్ ఇప్పుడు ఆసుపత్రులకు వచ్చాయి.