Delhi Stadium Issue: ఐఏఎస్ పెంపుడు కుక్క వాకింగ్ కోసం స్టేడియం ఖాళీ, మా కంటే పెంపుడు కుక్కే ఎక్కువా? అంటూ క్రీడాకారుల ప్రశ్న, వైరల్ గా మారిన ఢిల్లీ ఐఏఎస్ అధికారి నిర్వాకం, తక్షణమే బదిలీ చేస్తూ ఉత్తర్వులు
ఓ ఐఏఎస్ అధికారి(IAS Officer) తన పెంపుడు కుక్కతో (Dog) వాకింగ్ కు వస్తున్నారని స్టేడియం సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఐఏఎస్ అధికారి ఈవెనింగ్ వాకింగ్ కు వస్తున్న ఆ సమయంలో స్టేడియంలో క్రీడాకారులు ఎవ్వరూ లేకుండా చేస్తున్నారు స్టేడియం సిబ్బంది.
New Delhi, May 26: ఓ ఐఏఎస్ అధికారి(IAS Officer) తన పెంపుడు కుక్కతో (Dog) వాకింగ్ కు వస్తున్నారని స్టేడియం సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఐఏఎస్ అధికారి ఈవెనింగ్ వాకింగ్ కు వస్తున్న ఆ సమయంలో స్టేడియంలో క్రీడాకారులు ఎవ్వరూ లేకుండా చేస్తున్నారు స్టేడియం సిబ్బంది. దీంతో క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలా మధ్యలోనే తమను పంపించేయటం లేదా అస్సలు స్టేడియంకు రానివ్వకపోవటం చేయటం వల్ల ప్రాక్టీస్ చేసుకోవటానికి ఇబ్బందిగా మారుతోందని అని వాపోతున్నారు క్రీడాకారులు. ఢిల్లీలో ఒక ఐఏఎస్ అధికారి తన కుక్కతో ఈవినింగ్ వాక్ చేసేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలోని త్యాగరాజ్ స్టేడియానికి వస్తున్నారు. దీంతో ఆ సమయంలో స్టేడియంలోకి క్రీడాకారులను రానివ్వకుండా సిబ్బంది అడ్డుకుంటున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి రావడంతో క్రీడాకారుల కోసం స్టేడియం వేళలను పొడిగించింది.
ప్రభుత్వం ఆధ్వర్యంలోని త్యాగరాజ్ స్టేడియంలో (Thyagraj Stadium ) పలువురు క్రీడాకారులు శిక్షణ పొందటంతోపాటు ప్రాక్టీస్ చేస్తుంటారు. దాదాపు అదే సమయానికి ఢిల్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ఖిర్వార్ (Sanjay Khirwar ) సాయంత్రం ఆ స్టేడియానికి వచ్చి తన కుక్కతో కొంతసేపు వాకింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో స్టేడియం సిబ్బంది క్రీడాకారులను ముందుగానే అక్కడి నుంచి పంపివేస్తున్నారు. దీంతో క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంపై మీడియాలో వార్తలు రావడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal)స్పందించారు. క్రీడాకారులకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టేడియం వేళలను రాత్రి పది గంటల వరకు పొడిగించారు. ఢిల్లీ ఉప ముఖ్యమత్రి మనీష్ సిసోడియా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని గురువారం వెల్లడించారు.
News reports have brought to our notice that certain sports facilities are being closed early causing inconvenience to sportsmen who wish to play till late nite. CM @ArvindKejriwal has directed that all Delhi Govt sports facilities to stay open for sportsmen till 10pm pic.twitter.com/LG7ucovFbZ
— Manish Sisodia (@msisodia) May 26, 2022
ఐఏఎస్ అధికారి నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అతన్ని లద్దాఖ్ కు ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై విచారణ జరిపిన కేంద్ర హోంశాఖ...అతని చర్యలపై తీవ్రంగా స్పందించింది. తక్షణమే బదిలీ చేస్తున్నట్లు తెలిపింది.
(The above story first appeared on LatestLY on May 26, 2022 10:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

