![](https://test1.latestly.com/wp-content/uploads/2023/03/Crime-.jpg)
New Delhi, DEC 28: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గుర్ గ్రామ్ (Gurugram Murder) ప్రాంతంలో ఒక క్యాబ్ డ్రైవర్ హత్యకు గురైనట్లు తెలుస్తున్నది. రాజస్థాన్ లోని అల్వార్ (Alwar) ప్రాంతానికి చెందిన మిథున్ అనే క్యాబ్ డ్రైవర్, తన నలుగురు స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి మద్యం సేవించారని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. మద్యం తాగిన మత్తులో వారి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. తాగిన మత్తులో మిథున్‌ను కారుతో (Cab Driver Dies) ఢీకొట్టారు. అటుపై పలుమార్లు అతడి మీదుగా కారు నడిపించారని పోలీసులు చెప్పారు. అటుపై నిందితులు తప్పించుకుని పారిపోయారని తెలిపారు.
ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మరణించిన మిథున్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం తరలించారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత మిథున్ మృత దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. మిథున్ స్నేహితులే ఆయన్ను చంపేశారని మృతుడి కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్టన్లు సౌత్ జోన్ డీసీపీ సిద్ధాంత్ జైన్ తెలిపారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో బాద్షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని వెల్లడించారు.