New Delhi, June 23: నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదటగా నీట్ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రక్షాళనకు ఉన్నతస్థాయి కమిటీని వేసింది. ఆ తర్వాత ఎన్టీయే డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను పదవి నుంచి తొలగించింది. ప్రస్తుతం ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ITOP) చైర్మన్, ఎండీగా ఉన్న ప్రదీప్ సింగ్ ఖరోలాకు ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
CBI registers FIR in alleged paper leak in NEET Entrance Examination: CBI sources pic.twitter.com/W9djygcccO
— ANI (@ANI) June 23, 2024
ఈ క్రమంలోనే నీట్ లీక్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ శనివారం రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. లీక్ మూలాలను తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు కోసమే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.