Chennai, OCT 08: బ్యాంకుల్లో జరుగుతున్న కొన్ని పొరపాట్ల వల్ల ఖాతాదారుల గుండెలు గుభేలుమంటున్నాయి. ఉన్నట్టుండి మీ బ్యాంకు ఖాతా నుంచి లక్షలాది రూపాయలు కట్ అయితే మీకు ఎలా ఉంటుంది? అలాగే, మీ బ్యాంకు ఖాతాలో ఒక్కసారిగా కోట్లాది రూపాయలు వచ్చి పడితే? ఇటువంటి ఘటనలే జరుగుతున్నాయి. బ్యాంకుల అధికారుల నిర్లక్ష్యం వల్ల ఖాతాదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా, చెన్నైలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ముహమ్మద్ ఇద్రిస్ అనే వ్యక్తి ఫార్మసీలో పనిచేస్తున్నాడు. అతడు కొటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతా (Kotak Mahindra Account) నుంచి స్నేహితుడికి రూ.2 వేలు పంపాడు. ఆ తర్వాత ముహమ్మద్ ఇద్రిస్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు.
తన బ్యాంకు ఖాతాలో రూ.753 కోట్లు (Rs 753 Crore) ఉన్నట్లు తెలుసుకుని, షాక్ అయ్యాడు. అంత డబ్బు తన ఖాతాలో ఉండడంతో ఆందోళన చెందాడు. బ్యాంకు అధికారులకు ఈ విషయంపై సమాచారం అందించాడు. అతడి ఖాతాను తాత్కాలికంగా బ్యాంకు స్తంభింపజేసింది. గతంలోనూ ఇటువంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి.