Raipur, July 26: ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన స్కూటీకి దారివ్వలేదని ఆగ్రహించిన ఓ బాలిక సైకిల్‌పై వెళ్తున్న బధిరుడిని కత్తితో పొడిచి (Minor girl honks at deaf man) చంపేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లోని కంకాలిపార ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. బాలికను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రాయ్‌పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బాలిక(15) తన తల్లిని తీసుకుని స్కూటీపై వెళుతోంది. సైకిల్ తొక్కుకుంటూ ముందు వెళ్తున్న సదామా లదేర్(40) అడ్డురావడంతో హారన్ కొట్టింది. అయితే బధిరుడైన సుదామ హారన్ వినిపించక పక్కకు తప్పుకోలేదు. హారన్ ఎన్నిసార్లు మోగించినా నిర్లక్ష్యంగా వెళ్తున్నాడనే ( for not responding) కోపంతో బాలిక స్కూటీని ఆపి, అతడిపై కేకలు వేసింది. ఆపైన తన వద్ద ఉన్న చాకుతో అతడి మెడపై (stabs him to death ) పొడిచింది. అనంతరం తల్లిని అక్కడే వదిలేసి స్కూటీతో పరారైంది. తీవ్ర రక్తస్రావమైన సుదామ ఆస్పత్రికి వెళ్లేలోగానే తీసుకెళ్తుండగానే చనిపోయాడు.
మందిర్ హసౌద్ ప్రాంతంలో మైనర్‌ను అదుపులోకి తీసుకున్నామని, ఆమె నుంచి నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 302 (హత్య), ఆయుధాల చట్టం కింద ఆజాద్ చౌక్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ (పశ్చిమ) డిసి పటేల్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న మైనర్‌ను సోమవారం జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరుస్తామని ఆయన తెలిపారు