covid-19-vaccination (Photo-PTI)

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 44 వేల 877 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 684 మంది చనిపోగా.. అంతకుముందు రోజు 50వేల 407 కేసులు నమోదయ్యాయి. దేశంలో పాజిటివిటీ రేటు 3.17కి పెరిగింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5 లక్షల 37 వేల 45కి తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఇప్పుడు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5 లక్షల 37 వేల 45కి తగ్గగా.. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5 లక్షల 8 వేల 665కు పెరిగింది.

ఖబర్ధార్‌ మోదీ.. ఇది తెలంగాణ అడ్డా, నిన్ను తరిమికొట్టేందుకు తెలంగాణ పులిబిడ్డ‌ వస్తున్నాడు, ఏం చేస్కుంటావో చేసుకో. మీ సంస్కరణలను మేం అమలు చేయమని తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్

ఇప్పటివరకు 4 కోట్ల 15 లక్షల 85 వేల 711 మంది కరోనా సోకి కోలుకున్నారు. కరోనా మూడో వేవ్ దాదాపుగా తగ్గుముఖం పట్టినట్టుగా నివేదికలు చెబుతున్నాయి.

172 కోట్ల వ్యాక్సిన్ డోసులు..

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 172 కోట్ల యాంటీ-కరోనావైరస్ వ్యాక్సిన్‌లు ఇవ్వగా.. నిన్న ఒక్కరోజే 49 లక్షల 16 వేల 801 డోసులు ఇచ్చింది ప్రభుత్వం. దేశమంతా ఇప్పటివరకు 172 కోట్ల 81 లక్షల 49 వేల 447 డోసుల వ్యాక్సిన్‌ అందించారు.